Monday, April 20, 2009

advaitaM

కళ్లు రెండైనా చూపు ఒక్కటే
విహాయసాలు రెండైనా విహారం ఒక్కటే
మనుషులం ఇద్దరమయినా ఒక్కటే......

prapaMcaM

కొలిమిలో పడ్డప్పుడు........
మండక ?!

Wednesday, January 7, 2009

ప్రతిక్షణం ప్రతీక్షణం

ప్రతిక్షణం ప్రతీక్షణం

అనిత్యమని అశాశ్వతమని
జీవితంలో ఎదురయ్యే చిన్ని చిన్ని ఆనందాలను దూరం చేసుకోకు
ఒయాసిస్సుల దాకా బ్రతికించేవి నడిపించేవీ
ఎండమావులే
(సరిగా రాకపోవడం వల్ల తిరుగ పోస్ట్ చేసింది.)

Sunday, January 4, 2009

మానవుడే మహనీయుడు

05-01-2009

విశ్వాలకు అస్తిత్వం
సత్యాలకు దివ్యత్వం
మనిషిచ్చే గుర్తింపే

Saturday, January 3, 2009

కవిత గురించి......

1.
నా కోసం భూమ్మీద నిలబడ్డ దేవతా !
నిన్ను చూడడంలో నన్ను అనిమిషుణ్ణి చేశావ్ !!

2.

నా కవిత అలలాంటిది.....
నాలో పొంగే భావాలను
తీరం దాకా తీసుకెళ్ళి
ఒడ్డును సమార్ద్రం చేసి తిరిగి నాలోకి తీసుకు వచ్చేస్తుంది...

prati kshanam pratiikshanam

అనిత్యమనీ అసత్యమనీ
జీవితంలో ఎదురయ్యే చిన్ని చిన్ని ఆనందాలను వదులుకోకు .....
ఒయాసిస్సుల దాకా నడిపించేవి బ్రతికించేవి
ఎండమావులే .........